మాజీ జెడ్పిటిసి సభ్యులు మంద సంజీవరెడ్డిని కలిసిన నేతలు
బోడుప్పల్, మార్చి 27 (విశ్వం న్యూస్) : శ్రీ శోభకృత్ సంవత్సర పర్వదినం ఉగాది పురస్కరించుకొని మాజీ ఘట్కేసర్ జడ్పిటిసి సభ్యులు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మేడిశెట్టి వెంకట్ గుప్తా. ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డిని ఘనంగా శాలుతో సత్కరించి, ఉగాది పర్వదినం పురస్కరించుకొని స్వీట్స్ అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ ఉగాది పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి విరజిల్లాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకున్నట్లు తెలియజేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజానీకం వారి వారి కుటుంబ సభ్యులతో ఈ ఉగాది పర్వదినాన్ని సందర్భంగా ఉగాది పండుగను సంతోషంగా ఆస్వాదించాలని, దినదినాన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెంది బ్యాక్ టు ద సొసైటీ కింద సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల మెడోస్ కాలనీ కాలనీవాసులు, 11వ డివిజన్ ప్రజలు రామన్, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మీకాంత్ తదితరులు హాజరయ్యారు.