అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు – ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావు
గోవిందరావుపేట. డిసెంబర్ 30, (విశ్వం న్యూస్) : మండల ప్రజలందరికీ పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం పసర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు మీడియాతో మాట్లాడారు. 2023 నూతన సంవత్సరం అందరికీ శుభ సూచకంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక 2022 డిసెంబర్ 31 ను ప్రజలు ఇతరులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించడం మద్యం సేవించి వాహనాలు నడపడం డిజె సౌండ్ లు పెట్టుకొని ఇతరుల హక్కులకు భంగం కలిగించడం చేయరాదన్నారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా డిసెంబర్ 31 వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు శృతి మించి వేడుకలు నిర్వహించినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. మరో మారు మండల ప్రజలకు ప్రతినిధులకు అధికారులకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

