రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలి

రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలి

రైతు సంఘం మండల కార్యదర్శి సామ చంద్రారెడ్డి
గోవిందరావుపేట, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : రైతులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి సామ చంద్రారెడ్డి అన్నారు మంగళవారం రైతు సంఘం మండల కమిటీ సమావేశం గుండు రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నంగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు.

రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రైతు వ్యతిరేక విధానాలు ఇస్తుందని మండిపడ్డారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతన్న వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రైతులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు నాయకులు సూర్యనారాయణ నాగరాజు రాజేష్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *