బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం, బలగం

బీఆర్ఎస్ కార్యకర్తలే
మా బలం, బలగం

  • సీఎం కేసీఆర్ నేత్రుత్వంలో సాధించిన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుంది
  • 20ఏళ్లుగా వరుస విజయాలు అందిస్తున్న కరీంనగర్ ప్రజలకు నా ధన్యవాదాలు
  • ఢిల్లీ పార్టీల ఎజెండాలో తెలంగాణ ఉండదు
  • కొత్తపల్లి మండల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్

    కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒక్కసారి గెలిచిన వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేదని, 2000 సంవత్సరంలో రాజకీయంలోకి వస్తే కౌన్సిలర్గా గెలిపించారని 2005లో కార్పోరేటర్గా, 2009 నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా గెలిపించిన కరీంనగర్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కొత్తపల్లి మండలం చింతకుంట లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరే మా బలగం, మీరు లేకపోతే ఈ గెలుపు లేదు, ఇది నాపైన బాధ్యతను పెంచి విదుల పట్ల భయంతో నిలిచేలా చేస్తుందన్నారు. ఇంతగా ఆదరిస్తున్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని, తన శక్తి మేరకు పనిచేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తనకు ముందున్న కరీంనగర్ కు, ప్రస్థుత కరీంనగర్ ఎంత అభివ్రుద్ది చెందిందో కళ్లకు కనిపిస్తుందన్నారు. ఎక్కడికెల్లినా మీదేవూరు అంటే కరీంనగర్ అని, మీ ఎమ్మెల్యే ఎవరంటే గంగుల కమలాకర్ అని గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. తనకు గ్రానైట్ ప్యాక్టరీలున్నాయని గెలిస్తే నీల్లన్నీ వాటికే తీసుకుపోతాడని తనపై అసత్య ప్రచారాలు చేసారని ఇన్నేళ్లలో ఏనాడైనా, ఏ ఊరికైనా నీళ్లు ఆగాయా, నీళ్లు పెరిగాయా అని ప్రశ్నించారు.

    తనెప్పుడు గెలవడం కోసం ఏది పడితే అది మాట్లాడనని, ప్రజల సంక్షేమం, నగర ఆభివ్రుద్దే తన ద్యేయం అన్నారు, పదవి ఉన్నా లేకున్నా ఒకటే విదంగా ఉంటానని, కౌన్సిలర్గా ఎలా ఉన్నానో, మంత్రిగా కూడా అలాగే ఉన్ననన్నారు గంగుల కమలాకర్. మన నగరానికి సినీ ఇండస్ట్రీ తరలివస్తుందని, మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర టెంపుల్, సెంటర్ల బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ప్రంట్లతో అద్బుతంగా అభివ్రుద్ది చేసుకున్నామన్నారు. శ్రీవారి భ్రహ్మోత్సవాలు ఒకవైపు, కళోత్సవాలు మరోవైపు అదనంగా విజయోత్సవాలు జరుపుకుంటూ అన్నిరంగాల్లో దూసుకుపోతున్న కరీంనగర్ మనదన్నారు.

    ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ పిల్లి శ్రీలత – మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, జెడ్పీటీసీ పిట్టల కరుణ – రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *