హిందీ ప్రశ్నపత్రం లీకేజీ :
ఎవరు బాధ్యులు

కమలాపూర్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : గోడ మీద నుంచి వచ్చిన ఓ బాలుడు.. తన హిందీ పేపర్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు. తాను ఇవ్వలేదు. క్వశ్చన్ పేపర్ ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. అతనే బలవంతంగా తన ప్రశ్నపత్రం లాక్కొని సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుని వెళ్లిపోయాడు అని బాధిత విద్యార్థి వివరించాడు.
ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించినట్టు వాపోయాడు. కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వస్తే ఎవరో చేసిన తప్పునకు తాను బలైనట్టు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరో చేసిన తప్పునకు తనకొడుకు జీవితం నాశనమైందని తల్లి వాపోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు రాసేందుకు తన కొడుకును అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు.