సిరిసేడు గ్రామంలో రైతులకు సదస్సు
సెంజేంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో
ఇల్లంతకుంట, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో సెంజేంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో సుమారు 600 మంది రైతులకు మరియు 350 మంది ఫర్టిలైజర్ షాప్ యజమానులకు వరి పంటలో క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా వరి పంటలో తీవ్ర నష్టాన్ని కల్పిస్తున్న మొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగు సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తూ సింజేంటా కంపెనీ ప్లినోజులియన్ టెక్నాలజీ ద్వారా incipio అనే కొత్త పురుగుల మందును ఆవిష్కరించడం జరిగినది.
కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లా రీజయన్ మేనేజర్ కొండ భరత్, తెలంగాణ రీజియన్ సాంకేతిక నాయకులు డాక్టర్ అబ్దుల్ రషీద్, incipio మందు గురించి రైతులకు మరియు డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మేనేజర్, జమాల్ అధికారులు పాల్గొనడం జరిగింది.