బోడుప్పల్ కార్పొరేషన్ ద్వారక నగర్ లో
తప్పిన పెను ప్రమాదం

8,9వ డివిజన్లలో మంచి రోడ్లను తీసివేసిన
గుంతలో పడిన కుటుంబం..
బోడుప్పల్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8, 9వ డివిజన్ ద్వారకా నగర్ ఫేస్ 2 మెయిన్ రోడ్డులో ఉన్న పెద్ద గుంతలో బైక్ పై వెళుతున్న దంపతులు ఒక చిన్న పాప పడిపోయారు..!! అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదు!! కానీ ఆ గుంతలో పడి ఎవరికైనా తీవ్ర గాయాలు అయితే, ఎవరు బాధ్యత వహిస్తారని ఆ కుటుంబ సభ్యులు, ఆయా కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.
ద్వారక నగర్ ఫేస్ టు లో మంచిగా ఉన్న సీసి రోడ్లను తీసివేసి, ఎవరి కమిషన్ల కోసం కొత్త రోడ్లు వేయడానికి తీసివేశారో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అధికారులు కానీ పాలకవర్గం కానీ ఈ రోడ్డులో ఉన్న గుంతల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.!!
- ఈ గుంతలో పడి ప్రాణ నష్టం జరిగితే తప్ప మీరు స్పందించరా సర్, మేడం..??