గుడిసెలకు పట్టాలి ఇవ్వాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
ములుగు, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పసరాలో సర్వేనెంబర్ 109 లో గిరిజనులు మరియు ఇతర పేద లు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుడిసె వాసులతో కలిసి ఎస్ డి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం పసర లోని సర్వే నెంబరు 109 లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో లో గిరిజనులు మరియు ఇతర పేదలు 500 మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని ఆయన తెలిపారు .ఈ భూమిలో ఇద్దరు భూస్వాములు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులతో తప్పుడుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
వారు గుడిసవాసులను బెదిరిస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ సర్వే నెంబర్ లో గడిచిన 75 సంవత్సరాలలో ఏ భూస్వామి రెవెన్యూ రికార్డులో లేడని అన్నారు.జూన్ 2022 ఇంచార్జి పిఓ ఇది ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు. తప్పుడు రికార్డులతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో చట్ట ప్రకారం గిరిజనులు మరియు ఇతర పేదలు వేసుకున్న గుడిసెలకు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు . లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రత్నం రాజేందర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు, గొంది రాజేష్ ,పాయం శారద ,జి మ్మజ్యోతి, చాప పద్మ తదితరులు పాల్గొన్నారు.