హక్కుల కోసం రైతాంగం ఉద్యమించాలి
రైతు సంఘం జండా ఆవిష్కరణ
గోవిందరావుపేట, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : రైతాంగం తమ హక్కుల కోసం మరో పోరాటాన్ని నిర్వహించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సామ చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అఖిల భారత కిసాన్ సభ జెండా ఆవిష్కరణ గోవిందరావుపేట పసర గ్రామాల్లో రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో చేశారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ మహాసభ ఏర్పడి నేటికీ 88 సంవత్సరాలు పూర్తయిందని ఆయన అన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం పోరాటం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. తమ సంఘ నాయకత్వం దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు వ్యతిరేక చట్టాలతో ప్రజలను పెట్టుబడిదారి చేతుల్లో బానిసలుగా మార్చిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మూడు నల్లా చట్టాలు తెచ్చిందనీ ఆయన ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని 2020 విద్యుత్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని పెరిగిన నిత్యావసర పెరిగిన ధరలను నియంత్రించాలనీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గుండు రామస్వామి జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి మండల కమిటీ సభ్యులు కడారి నాగరాజు గుండు లేనిన్ గుండు సత్యనారాయణ గొంది రాజేష్ పల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.
