కాంగ్రెస్ సీనియర్ నేత
జానారెడ్డికి అస్వస్థత
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిన్న మోకాలి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వైద్యపరీక్షలో ఆయనకు గుండెలో రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో జానారెడ్డికి నిన్న రాత్రి.. వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.