భక్తురాలి విచిత్ర కోరిక

హనుమకొండ, మార్చి 3 (విశ్వం న్యూస్) : మేడారం సమ్మక్క సారలమ్మ నాలుగవ రోజు హుండీ లెక్కింపు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక భక్తురాలు అమ్మవార్లను విచిత్రమైన కోరిక కోరుకున్నది.
తన భర్త బెట్టింగ్ కట్టడం మానేయాలని, అలానే వాళ్ల అక్క కొడుక్కి ఐఐటి లో సీటు రావాలని కోరుకుంటూ చీటీ రాసి హుండీలో వేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.