రైతాంగాన్నిఆదుకునే దిక్కేది

- ఎకరానికి 35,000 పంట నష్టపరిహారం చేల్లించాలని స్థానికి ఎమ్మేల్యేలకు హెచ్చరిక
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సేంట్రల్ కమిటి సభ్యులు అంబటి జోజిరెడ్డి
కరీంనగర్ బ్యూరో, మే 2 (విశ్వం న్యూస్) : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సేంట్రల్ కమిటి సభ్యులు అంబటి జోజిరెడ్డి మంగళవారం కరీంనగర్ అసేంబ్లి కాన్షియస్ గోపాల్ పూర్ గ్రామంలో వడగళ్ల వర్షాల కారణంగా నిటమునిగి పోయి, గింజ నేల రాలిపోయిన తిరుపతి రెడ్డి అనే రైతు పోలాలను పరీశీలించి రైతులకు ధైర్యం నెలకోల్పాడు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలా కారణంగా పంటలు దెబ్బ తిని తీవ్ర ధు:ఖంలో మునిగి వున్న రైతులను ఏ మాత్రం కూడా పట్టంచుకోని రాష్ట్ర ప్రభుత్వం అని ఆరోపించారు.
ఒక్కొక్క రైతు ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడి పెట్టి పండిస్తే ఒక్క గింజకూడా మిగలకుండా వరి ఎకరాలలో ఉందని హర్వేస్టర్లు కాదు కద కూలీలు వచ్చి కోసిన కూడా గడ్డి కూడా మిగలని పరిస్తితిలో రైతులు వున్నారని ఆవేధన వ్యక్తంచేశారు.గింజ మిగలకుండ పంట చేతికి రాకపోవడంతో రైతులు తీవ్రధు:ఖంలో మునిగివున్న కూడా పట్టించుకోని ఫ్రభుత్వాల వలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.గోపాల్ పూర్ గ్రామంలో వందల ఎకారాల పోలాలు వరికోతకి ఉన్నాయి కాని గడ్డి కూడా మిలలేని స్తితిలోవున్న రైతులను స్థానిక ఎమ్మేల్యే ప్రభుత్వాలు ఆదుకోవాలని హేచ్చరించారు.
ఒక్కోక్క రైతుకు ఎకరాని 35,000 రూపాయలు నష్ట పరిహారంగా ఇవ్వాలని స్థానిక ఎమ్మేల్యేలను గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని డిమండ్ చేశారు.లేని పక్షంలో కలక్టరేట్ ను ముట్టడిస్తామని హేచ్చరించారు అయిన కూడా స్పందించకపోతే ప్రగతి భవన్ ని కూడ ముట్టడించడానికి కూడా వేనకాడాబోమని ఆరోపించారు.