- వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని
పెద్ద మనుషుల తీర్పు - జీర్ణించుకోలేకపోయిన పెద్దాయన
సిద్దిపేట, మే 5 (విశ్వం న్యూస్) : కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుమారులకు వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిని పంచేశారు.
వెంకయ్యకు వృద్ధాప్య పింఛను వస్తుంది. గ్రామంలోనే ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవారు. ఐతే 5 నెలల క్రితం వెంకయ్య పోషణ నిమిత్తం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రిని పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది.
దీంతో సొంత ఊరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకయ్య గత మంగళవారం అదే గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధ వెళ్లగక్కారు. ఈ రోజు రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు (మే 3) ఉదయం నవాబుపేటలోని తన మరో కుమారుడి వద్దకు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకయ్య ఏ కుమారుడి ఇంటికీ చేరలేదు.
గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం ఉండటంతో పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆ మృతదేహం వెంకటయ్యదేనని గుర్తించారు. వెంకయ్య చితి పేర్చుకుని మంటరాజేసి దానిలో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు ఏఎస్‌ఐ మణెమ్మ ప్రాథమిక నిర్ధారణక వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
- కొడుకుల ప్రేమ లేని – వంతుల వలన విసుగు చెంది – స్వంతంగా చితి పెడ్చుకొని – అగ్నిలో ఆహుతి ఐన ఆ పెద్దాయన మనల్ని ఏమని ప్రశ్నిస్తున్నాడు..?
ప్రేమ లేని వంతుల ముద్ద
మురికాయేను…
ఉన్న ఆస్తి ఉడ్చి ఇచ్చే
కొడుకుల తీరుకు మూడ్చ వచ్చే
కాట్నం పేర్చి కార్చిచ్చు
అంటించుకున్న అయ్యను..
కన్న ప్రేమ.. అగ్ని ప్రేమై దొరికెను
నిప్పు కణికే నిద్రబుచ్చెను.
విషయం విన్న వీర మీసాలు
మిన్నకుండే
నెత్తురు పంచ్చి ..ఉన్నదంతా
పంచ్చిన నాన్నకు…
అణువంత ప్రేమ అడుక్కునే
పరిస్థితి వచ్చాక ….
నాన్నకు ఇవ్వటమే తెలుసు
అడుక్కోడం రాదు అని..
కొడుకుల వద్ద ప్రేమ
అడుక్కోవటం ఏంట్రా.. అంటూ
ఇదిగో….. పంచ్చిన రక్తం
ఓ..డుతుందిరా…చూడండి..రా.
కొడుకుల రూపంలో ఉన్న
కోడెనాగులకు…ఇచ్చిన
అణువంత ప్రేమ కోసం ఆహుతి
నాన్న….చితి…..ఓ….బహుమతి
ఆప్యాయత సన్నగిల్లి సమిధై
సమాజానికి సమాధానం అడిగే
సాగర్
ఉత్తమ సామాజిక వేత్త
(ప్రభుత్వ) అవార్డ్ గ్రహీత
– జర్నలిస్ట్