- సీఎంగా సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్
కర్ణాటక, మే 20 (విశ్వం న్యూస్) : కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోట్.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ముగ్గురు దళితులకు అవకాశం కల్పించారు.
మొత్తం ఎనిమిది మంది మంత్రుల్లో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రమే డీకే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనే తలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమం త్రులు నితీష్ కుమార్, ఎంకే స్టాలిన్, భూపేశ్ భగేల్, అశోక్ గెహ్లోత్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం హాజ రయ్యారు.