గోపి…గోపి…గోపి…. వీడియో వైరల్..

వరంగల్, మార్చి 2 (విశ్వం న్యూస్) : 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత, 22 ఏళ్ల వయసున్న ఓ..యువకుడితో ఫోన్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ప్రియుడి మోజులో భర్త పిల్లలను విడిచి అతనితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి భైక్ పై వెల్తున్న ఇద్దరిని అడ్డగించాడు.. దీంతో భైక్ ను వదిలి పరారైన సంఘటన గత నెల 5 వ తేదిన పేట్ బషీరాబాద్ పీఎయస్ పరిదిలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి (22 ) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫోన్ యాప్ లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన సుకన్య (35) పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన భర్త జయరాజ్ (38 ) సుకన్యను మందలించాడు. ఈక్రమంలో గత నెల 5 వతేదిన సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది. ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది.

నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు. చివరిసారిగా బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *