సర్జన్స్ అసోసియేషన్
జిల్లా అధ్యక్షులుగా
డా. ఎలగందుల శ్రీనివాస్

కరీంనగర్, మార్చి 7 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా సర్జన్స్ డాక్టర్స్ అందరిని ఓకే చత్రం కిందికి తెస్తూ అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్ అసోసియేషన్ ఏర్పాటులో భాగంగా శుక్రవారం కరీం నగర్ నగరంలోని మైత్రి హోటల్లో కరీంనగర్ జిల్లా సర్జన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన మొదటి సమావేశంలో జిల్లా సర్జన్ డాక్టర్స్ అసో సియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇట్టి నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల కాల వ్యవధికి గాను ప్రెసిడెంట్ గా డా. ఎలగందుల శ్రీనివాస్ వాసు దేవ హాస్పిటల్, సెక్రటరీగా డా. వి మంగీలాల్, ట్రెజరర్ గా డా. సాయి ప్రసాద్లతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సంద ర్భంగా ప్రెసిడెంట్ గా డా. ఎలగందుల శ్రీనివాస్, డా. వి. సూర్యనారాయణ రెడ్డిలు మాట్లా డుతూ.. కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్ (కే.ఏ.ఎస్. ఎస్) ద్వారా పలు ఉచిత క్యాంపు లు నిర్వహించడం, అత్యాధునిక టెక్నాలజీ మార్పు లతో కూడిన ఆధునిక సర్జరీ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికిగాను విధివిధానాలు, కార్యాచరణను రూపొందించుకుని సర్జన్ డాక్టర్స్ అసోసియేషన్ ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.సిహెచ్ రవీందర్ రావు, డా. వి సూర్యనారాయణ రెడ్డి, డా. జి. ప్రశాంత్, డా. జయరాం, డా.బాస శంకర్, డా. ఎలగందుల శ్రీనివాస్, డా.మంగిలాల్, డా. సి.హెచ్. ప్రదీప్, డా.అరుణ్, డా. సాయి ప్రసాద్, డా.మోహన కృష్ణ, డా. ప్రవీణ్, డా. హరికృష్ణ రెడ్డి, సర్జన్స్ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
అభినందనల వెల్లువ…
కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్ అసోసియేషన్కు ఎన్నికైన నూతనంగా కార్యవర్గానికి ఐఎంఏ కరీంనగర్ ప్రెసిడెంట్ డా.నరేష్, టీఎస్ ఎంసి మెంబర్లు డా.బండారి రాజ్ కుమార్, డా.అమిత్, తానా కరీంనగర్ ప్రెసిడెంట్ డా.చాట్ల శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర తానా ప్రెసిడెంట్ డా.సురేష్, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, గవర్నర్ వెంకటేశ్వర్లు, గాలిపెల్లి నాగేశ్వర్, ముస్కుల విద్యాసాగర్ రెడ్డి, లయన్స్ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, కొండా వేణుమూర్తి, చిదుర సురేష్, డా. రమణా చారి, డా.వసంత రావు, డా. ఎం. ఎల్. ఎన్. రెడ్డి, డా. అలిమ్ లతో పాటు పలువురు డాక్టర్లు అభినం దనలు తెలిపారు.