రాష్ట్ర లా ఫోరం విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏబీవీపీ ధర్నా
అంబర్ పేట, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : ఏడెడ్ కళాశాలలను ప్రభుత్వకారణ చేయాలి అని ఏవి కళాశాలలో విద్యానగర్ జిల్లా ఘగన్ మహాల్ శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్వర్యంలో ధర్నా. ఏవి కళాశాలలో ఏడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర లా ఫోరమ్ కన్వీనర్ విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువు కోసం ఏడెడ్ కళాశాలలు ప్రారంభిస్తే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉన్న ఏడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోదు అని వెంటనే ఏడెడ్ కళాశాలలను ప్రభుత్వం ఆదుకోవాలి అని అన్నారు. అక్కడ ఉద్రిక్తతతో పదిహేను మంది మంది కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ కార్తీక్, రేవంత్, ప్రణయ్, రోహిత్, పాషా, కమాల్, అనిరుధ్, అరవింద్, ప్రశాంత్, వంశీ, పవన్, స్నేహిత్, పూర్ణా సాయి మరియు విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొన్నారు.