ప్రతి నెలా రూ.4000 పింఛన్..
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 4 వేల పెన్షన్ : రాహుల్ గాంధీ
ఖమ్మం, జూలై 2 (విశ్వం న్యూస్) : తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘చేయూత’ పథకం ద్వారా ప్రతి నెలా రూ. 4000 పింఛను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖమ్మం వేదికగా ఆదివారం (జూలై 2) సాయంత్రం నిర్వహించిన ‘తెలంగాణ జన గర్జన’సభలో ఇందుకు సంబంధించిన ప్లకార్డులను రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు వేదికపై ప్రదర్శించారు.
అధికారంలోకి వస్తే.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు చేయూత పథకం కింద నెలకు రూ. 4000 పింఛన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ అని పేర్కొంటూ ఈ పథకాన్ని ప్రకటించారు.
- ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ ముగిసింది . ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు.