పదవ తరగతి 2023 ఫలితాల్లో
అల్ఫోర్స్ ప్రభంజనం
అల్ఫోర్స్ గ్రూఫ్ అఫ్ స్కూల్కు చెందినటువంటి 106 మంది విద్యార్థులు విశేష ప్రతిభతో 10 జి.పి.ఏ
కరీంనగర్ బ్యూరో, మే 10 (విశ్వం న్యూస్) : బుధవారం రోజు ప్రకటించబడిన 10వ తరగతి 2023 ఫలితాలలో అల్ఫోర్స్ అఖండ విజయం సాధించారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఈ సందర్భముగా తెలిపారు. అంతే కాకుండా 96 మంది విద్యార్థులు 9.8 జి.పి.ఏ, 77 మంది విద్యార్థులు 9.7 జి.పి.ఏ 01 విద్యార్థి 9.6 జి.పి.ఏ , 71 మంది విద్యార్థులు 9.5 జి.పి.ఏ సాధించారు. 9 జి.పి.ఏ. పైన 463 మంది విద్యార్థులు అల్ఫోర్స్లోనే ఉండడం విశేషం.
అల్ఫోర్స్ గ్రూఫ్ అఫ్ స్కూల్లో పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ , విద్యార్థుల కృషివల్ల ఇంతటి ఘన విజయంను సాధించడం జరిగింది. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తూ సంచలన విజయాలను సాధిస్తూ తెలంగాణలో అల్ఫోర్స్ తనకుతానే సాటి అని అల్ఫోర్స్ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఈ సందర్భముగా తెలియజేయుచున్నాను.
నేటి ఫలితాలలో అత్యుత్తమ జి.పి.ఏ లు సాధించిన మా అల్ఫోర్స్ అణిముత్యాలను ఈ సందర్భముగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరము అల్ఫోర్స్ విజయపరంపరను కొనసాగించడానికై ఆహార్నిశలు కృషిచేస్తున్న ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులకు , సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ గ్రూఫ్ అఫ్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గోన్నారు.