అల్ఫోర్స్ : ఘనంగా రెండో రోజు
సుందరకాండ హనుమత్ మహాయజ్ఞం

కరీంనగర్ బ్యూరో, మే 13 (విశ్వం న్యూస్) : సుందరకాండ చాలా విశిష్టమైనదని మరియు ఎంతో మహిమగలదని దానిని పఠించినగాని, విన్నగాని, ప్రచారం చేసినగాని, పరీరక్షించడానికి, ఎన్నో లాభాలు చేకూరడమే కాకుండా అష్టఐశ్వర్యాలను కల్పిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర ఎ.సి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రెండో రోజు హనుమత్ మహాయజ్ఞం కార్యక్రమాన్ని కలశారాధనతో వైభవంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ వేదపండితులు శ్రీమాన్ వేదాంతచార్యులు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మాహాఅద్భుతంగా శ్రీరాములవారి సేవను వేదోక్తంగా చేయడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని మరియు విశ్వశ్రేయస్సుకై శ్రీమద్రామయణం ప్రాంగణంలో రుత్వికులచే పఠించడం జరుగుతుందని మరియు మూలవిరాట్టుకు విశేషంగా వివిధ ఫలాలతో, పుష్పాలతో, ఫల పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో మన్యుసూక్త పఠినంతో ఘనంగా అభిషేకం నిర్వహించడం జరిగినదని చెప్పారు.

శనివారం స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో విశేషంగా తమలపాకులతో అలంకరణ చేయడం జరిగినదని చెప్పారు. రెండో రోజు పూజలో భాగంగా ప్రాతకాల పూజ, కలశారాధన, బింభం ఆరాధన, చక్కారాంజ, మండలరాధన, వేదవిన్నపం, తదితర కార్యక్రమాలతో మహావీర భజరంగభళి భజన భక్తి పారవశ్యాన్ని పెంపొందించి మరియు విచ్చేసిన దీక్షాపరులకి భిక్ష మరియు భక్తులకు అన్నధానం చేశారు.
రేపు అనగా హనుమన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా అభిషేకాలు ప్రాతకాలమునందే అరంభం అవుతుందని మరియు ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమాన్ని అపూర్వంగా కన్నులపండవగా వేదపఠనంతో నిర్వహించి కార్యక్రమాన్ని స్వామి వారి ఆశీస్సులతో ద్విగ్విజయంగా ముంగింప చేస్తామని చెప్పారు. ఇట్టి సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అహ్వానించారు.