గ్రంథాలయాల అభివృద్ధికి 3 కోట్లు

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్
పొన్నం అనిల్ కుమార్ గౌడ్
కరీంనగర్ బ్యూరో, మే 13 (విశ్వం న్యూస్) : 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లా గ్రంధాలయ సంస్థ కు ఆమోదించబడిన బడ్జెట్ నుండి వివిధ పద్దులకు 3,18,00,000 రూపాయలను నిబంధనల మేరకు కర్చు చేయుటకు ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశ కమిటీ సభ్యులు. బిల్డింగ్ లో నిర్మాణం, పబ్లిక్ రీడింగ్ రూం ల ఏర్పాటు , ఆన్ డిమాండ్ పుస్తకాల కొనుగోలు తదితర అంశాల పైన చర్చ జరిపి అన్ని అంశాలపై సర్వ సభ్య సమావేశ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి కర్చుల పై వివిధ పద్దుల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా కర్చుచేయబోతున్నం అని తెలియచేశారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి అనిశెట్టి సరిత గారు, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ జయశంకర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కృపారాణి గారు, అడిషనల్ డీ పీ ఆర్ ఓ శారద గారు , జిల్లా పంచాయతీరాజ్ ఆఫీస్ నుండి ఈ సమావేశానికి హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ జిల్లా లోని గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు మరియు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరియు నగర మేయర్ మరియు పాలక వర్గం , జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మన్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ గ్రంథాలయంగా తీర్చిదిద్దాము అని ఇక ముందు కూడా వీరందరి సహకారంతో ఇదే ఉత్సాహంతో విద్యార్థులకు సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.