కరీంనగర్:సెమ్స్ ఒలింపియాడ్‌లో
మానేరు విద్యార్థులకు
ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌లు

అభినందించిన పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు
కరీంనగర్ బ్యూరో, మే 20 (విశ్వం న్యూస్) : దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలింపియాడ్ నేషనల్ టాలెంట్ టెస్ట్ 2022 ఫలితాల్లో కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటి జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో పలువురు విద్యార్థులు అద్వితీయంగా రాణంచి తొలి 10 ర్యాంక్‌లలో నిలిచి ప్రభంజనం సృష్టించారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రెండు స్థాయిల్లో నిర్వహించగా 10వ తరగతికి చెందిన ఎం సహస్ర 78 మార్కులు, 9వ తరగతికి చెందిన హర్షవర్ధన్ 82 మార్కులు సాధించి ఆల్ ఇండియా నంబర్ వన్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అదే విధంగా 8వ తరగతికి చెందిన ఎస్ వరుణ్ కుమార్ 72 మార్కులు, 6వ తరగతకి చెందిన జోహా ఆనామ్ 66 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో ఫస్ట్ ర్యాంక్‌లను కైవసం చేసుకొన్నారు.

పలు తరగతులలో అజ్మతున్నీస్సా, శ్రీరామ్ సంహిత్, పి పవన్ తేజ, ఐజా రెహనాజ్, శిరీష, స్నిగ్ధశ్రీ, సనా ఫర్హత్, కె స్పూర్తి, జి ఇష్టారెడ్డి, ఎస్ సాత్విక్ రెడ్డి, జెయాన్, రిషికా శర్మ లు ఆల్ ఇండియా స్థాయి లో టాప్ 20 ర్యాంక్‌లలో, జి పరాక్షిత్ సారధి, శ్రీ లక్ష్మీ, వర్షిత్ కుమార్, ఎ అరవింద్ రెడ్డి, శరత్, ఆరూష్, సానియా, జి ప్రజ్ఞ, జె చిన్మయ, బింగి సన్విత లు రాష్ట్రస్థాయిలో టాప్ 10 ర్యాంక్‌లలో నిలిచి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్రస్థాయి లో ర్యాంక్‌లను కైవసం చేసుకొన్న విద్యార్థులను శనివారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు అభినందించారు. నెంబర్ వన్ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులకు శాలువాలతో సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన సెమ్స్ ఒలింపియాడ్‌లో మానేరు విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలువడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చునని, విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉన్నత స్థానంలో నిలిచిన సమాజసేవకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.