పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన
విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోతో
పాటు ప్రోత్సాహ బహుమతి

దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, మే 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో పదవ తరగతిలో మొదటి,రెండవ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోలు దారుల్ అన్సా ర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలలొ అయితేనే మెరిట్ వస్తుంది అని నమ్మే తల్లిదండ్రులు ఇది గమనించాలని కష్టపడితే ఎక్కడైనా ప్రతిభ కనబర్చవచ్చు అని ఈ విద్యార్థులు నిరూపించారని అన్నారు.

ఇరవై మూడు పాఠశాలల మొదటి రెండవ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నరేందర్ రెడ్డి స్వయంగా ఒక్కో పాఠశాలకు ఇద్దరి చొప్పున మొదటి ప్రోత్సాహ బహుమతి వెయ్యి రూపాయలు, రెండవ ప్రోత్సాహ బహుమతి అయిదు వందలు మొత్తం నలభై ఆరు మందికి ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రమం హఫీజ్ సయ్యద్ రిజ్వాన్ మరియు సొసైటీ సభ్యులు,ఎండి తాజ్,నీహాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.