అఖిల పక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి: రాగళ్ల ఉపేందర్ మాదిగ

నాగారం, జనవరి 22 (విశ్వం న్యూస్) : నాగారం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశాన్ని పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం నాగారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ల రాజేష్ మృతికి కారణమైన వారు ఎవరైనా సరే, వారిని వదిలి పెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం సాధించే దిశగా ఈ అఖిల పక్ష సమావేశం కీలకమని పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో బొజ్జ సైదులు మాదిగ, చిప్పలపెల్లి మల్లేష్, కోటి శ్రవణ్, బన్నీ మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.