ఆధారాలు లేని నోటీసులు కేవలం వేధింపులే : ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, జనవరి 22, 2026 (విశ్వం న్యూస్) : ఆధారాలు లేవు… ఆరోపణల్లో పస లేదు!
నిన్న హరీష్ రావు గారు, నేడు కేటీఆర్ గారు—ఇలా ప్రతిపక్ష నేతలపై వరుసగా నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు అవమానం, చట్టపాలనపై ప్రత్యక్ష దాడి.
పాలనలో వైఫల్యాలను దాచిపెట్టేందుకు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక Telephone Tapping Case పేరుతో రాజకీయ కక్షసాధింపునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయుధంగా మార్చుకుంది. సాక్ష్యాలు లేని నోటీసులు న్యాయ ప్రక్రియ కాదు—అవి కేవలం అధికార దుర్వినియోగంతో చేసే వేధింపులే.
‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు’ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కపట నాటకాలు. ప్రజాస్వామ్యంలో భయపెట్టే పాలనకు చోటు లేదు. చట్టం ముందు ప్రతిపక్షం–పక్షపాతం కాదు, సత్యమే ప్రమాణం.
నిజం ఆలస్యమవుతుందేమోగానీ ఓడదు.