దేశాన్ని అప్పుల్లో ముంచి పారిపోయిన వారంతా ‘మోడీ’ లే

దేశాన్ని అప్పుల్లో ముంచి
పారిపోయిన వారంతా ‘మోడీ’ లే

  • నేర నిరూపణ అయిన బిజెపి నేతలకు జైలు శిక్ష ఎందుకు అమలు చేయడం లేదు
  • మోడీ దొంగ అన్న వారందరిని జైల్లో పెట్టాలంటే ఈ దేశంలో జైల్లు సరిపోవు.
  • జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్, మార్చి 27 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొని నిర్ణయాన్ని ఖండిస్తూ పిసిసి పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా దొంగతనంగా దేశం విడిచి పారిపోయిన వ్యాపారులంతా గుజరాత్ కు చెందిన వారే అని 2019 ఎన్నికల ప్రచారంలో దేశాన్ని అప్పుల ఊబిలో నుంచి పారిపోయిన వారంతా మోడీ అని పేర్లు పెట్టుకున్న వారే పని చేసిన వ్యాఖ్యలపై మోడీ అనే పేరు లో తన ఇంటిపేరు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేయించి రాజకీయ కుట్రతో రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుండి బహిష్కరించడం మోదీ నియంత పాలనకు నిదర్శనం.

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ అంబానీ అదానీలకు దోచిపెడుతున్నారు, అదాని వ్యాపారాల షేర్లు పడిపోవడం వల్ల ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది, దీనిపై హిండేన్ బర్గ్ సంస్థ వాస్తవాలు బయటపెట్టింది, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి వారిద్దరికీ సాన్నిహిత్యం ఉందని, అతని వ్యాపారాలలో షెల్ కంపెనీలో 23 వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలని, అనుభవం లేని అదానీ కి 6 ఎయిర్పోర్ట్ లు ఎలా ఇచ్చారని, కరోనా లాక్ డౌన్ తో దేశం ఆర్థిక వ్యవస్థ పడిపోతే, అదానీ మాత్రం అత్యంత సంపన్నునిగా ఎలా ఎదిగాడని వాటి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయడం కోసం జేపిసి వేయాలని పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నిజాలు ప్రజలకు చెప్పకుండా, రాహుల్ గాంధీని పార్లమెంటు నుండి బహిష్కరించడం పై దేశవ్యాప్తంగా కాకుండా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, మోడీ ఈ దేశం పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మేడిపల్లి సత్యం, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్, మడుపు మోహన్, జిల్లా కాంగ్రెస్ సంబంధ సంఘాల అధ్యక్షు పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, యం. డి .తాజ్, శ్రావణ్ నాయక్, శ్రీమతి కర్ర సత్య ప్రసన్నారెడ్డి, మెనేని రోహిత్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మల్యాల సుజిత్ కుమార్, సయ్యద్ అఖిల్, గడ్డం విలాస్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్, నాగి శేఖర్, మామిడి అనిల్, ఎస్.ఎల్ గౌడ్, కొమ్మెర రవీందర్ రెడ్డి, సాయిని రవి, పూదరి అరుణ శివ, రాజిరెడ్డి, రామి రెడ్డి, స్వామి రెడ్డి, సొల్లు బాబు, సారంగపాణి, తిరుపతి రెడ్డి, పురుమల్ల మనోహర్, సాహెబ్ హుస్సేన్, రామా రావు, రోళ్ల సతీష్, గవ్వ రాజేందర్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, బొమ్మరవెని తిరుపతి, ఇమ్రాన్, ఖలీమ్, హైమద్, దన్ను సింగ్, సంపత్, కిరణ్, వెంకన్న, లయీక్, లావణ్య, స్వప్న, బొబ్బిలి విక్టర్, సలీ మొద్దిన్, గోపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, పులి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *