చంద్రబాబు కేబినెట్ మంత్రులకు
శాఖల కేటాయింపు..
పవన్‌కు కీలక బాధ్యతలు
హైదరాబాద్, జూన్ 14 (విశ్వం న్యూస్) : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ క్రమంలోనే జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులకు కీలక శాఖలు దక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటుగా.. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణశాఖ మంత్రిగా నియమితులయ్యారు. నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, కందుల దుర్గేష్‌కు పర్యాటక, సాంస్కృతిక శాఖ దక్కింది.
నారా చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు
1) కొణిదెల పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం
– పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి,
అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావణ శాఖలు
2) నారా లోకేష్ –
ఐటీ, మానవవనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు
3) కింజరాపు అచ్చెన్నాయుడు
– వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ,
డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖలు
4) కొల్లు రవీంద్ర –
గనులు, ఎక్సైజ్ శాఖలు
5) నాదెండ్ల మనోహర్ –
పౌరసరఫరాలశాఖలు
6) పి.నారాయణ –
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ
7) వంగలపూడి అనిత
– హోంశాఖ
8) సత్యకుమార్ యాదవ్ –
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలు
9) నిమ్మల రామానాయుడు –
జలవనరుల అభివృద్ధి శాఖలు
10) ఎన్.ఎమ్.డి.ఫరూక్ –
మైనార్టీ, న్యాయశాఖలు
11) ఆనం రామనారాయణరెడ్డి –
1దేవాదాయశాఖలు
12) పయ్యావుల కేశవ్
– ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్,
శాసనసభ వ్యవహారాల శాఖలు
13) అనగాని సత్యప్రసాద్ –
రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖలు
14) కొలుసు పార్థసారధి –
గృహ నిర్మాణం, I &PR శాఖలు
15) డోలా బాలవీరాంజనేయస్వామి –
సాంఘిక సంక్షేమ శాఖ
16) గొట్టిపాటి రవి కుమార్ –
విద్యుత్ శాఖ
17) కందుల దుర్గేష్ –
పర్యాటక, సాంస్కృతిక శాఖ
18) గుమ్మడి సంధ్యారాణి –
స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ
19) బీసీ జనార్థన్ రెడ్డి –
రహదారులు, భవనాల శాఖలు
20) టీజీ భరత్ –
పరిశ్రమల శాఖ
21) ఎస్.సవిత
– బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలు
22) వాసంశెట్టి సుభాష్
– కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
23) కొండపల్లి శ్రీనివాస్
– MSME, సెర్ప్, NRI ఎంపవర్‌మెంట్ శాఖలు
24) మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
– రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు.