ఘనంగా అంబేద్కర్
జయంతి వేడుకలు

- గంధం గూడ మరియు బైరగూడ చౌరస్తాలో అన్ని పార్టీల నాయకుల సమక్షంలో వేడుకలు

బండ్లగూడ జాగిర్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : బండ్లగూడ చౌరస్తాలో సమసమాజ స్థాపకుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రజాసేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తోకల శ్రీనివాస్, కార్తీక్ రెడ్డి, నార్సింగ్ చైర్మన్ వేణు గౌడ్, డైరెక్టర్లు తలారి ప్రేమ్ కుమార్, సాదిక్, పూలపల్లి కృష్ణారెడ్డి, నవీన్ కుమార్, భొగాల శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, కొరవి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవ సమితి కమిటీ సభ్యులు రమేష్, అరుణ్, నరేందర్, విక్కీ, మదర్, సుధాకర్ లు కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.