కోర్టు ధిక్కరణ అత్యుత్సాహంతో ఆంజనేయ నగర్ కాలనీ ఎన్నికలు

కోర్టు ధిక్కరణ అత్యుత్సాహంతో ఆంజనేయ నగర్ కాలనీ ఎన్నికలు

* కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల చీఫ్ అధికారి
* అత్యుత్సాహంతో వేరే ప్రపోజ్డ్ ఎన్నికల ఇన్చార్జిల పేరుతో ఎన్నికలు
* కోర్టు అదేశంతో కడారి బాలేశం ఎన్నికల నుండి తప్పుకున్నారు

బోడుప్పల్ , ఫిబ్రవరి 7 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ ఆంజనేయ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎలక్షన్స్ పురస్కరించుకొని ఆయా కాలనీలో జరిగిన అక్రమ వసూళ్లు, కుంభకోణాలు, లక్షల రూపాయలు వసూలు చేసి వాడుకున్నట్లు ఆరోపణలు రాగా ఆయా ఎస్బిఐ బ్యాంక్ కరెంట్ అకౌంట్ కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యురాలు, ప్రపోజ్డ్ ఎలక్షన్స్ చీప్ అధికారి ఇంకా కొంతమంది అధికారులు కలిసి కాలనీ సంక్షేమం కోసం ఎన్నికలు నిర్వహించాలని ప్రపోజల్ తీసుకొచ్చి ఎన్నికల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన తతంగం అంతా బయటికి రావాలి అదేవిధంగా ఎస్బిఐ అకౌంట్ ఓపెన్ చేయాలి, రాసుకున్న బై లా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కాలనీ సీనియర్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే రమణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కోర్టు నోటీసులు కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,కోశాధికారి అదేవిధంగా ప్రపోజ్డ్ చీఫ్ ఎలక్షన్ అధికారికి నోటీసులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నోటిసులు ఎన్నికల ప్రపోజ్డ్ చీఫ్ అధికారి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొంతమంది మాజీ పాలకవర్గాల నాయకులు అత్యుత్సాహంతో కోర్టు నోటీసులు కూడా లెక్కచేయకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండానే అదర్ పార్టీ అంటే పోటీదారులు లేకుండానే ముందుగా ప్రకటించినట్లు కాలనీ సీనియర్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశం అధ్యక్షుని రేసులో ఉన్నట్లు దరఖాస్తు ఇచ్చారు. ఆ తర్వాత కోర్ట్ ఆర్డర్ ని గౌరవించి మళ్లీ అధ్యక్షుని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బహిరంగంగానే ఎన్నికల అధికారులకు మెసేజ్ ఇచ్చి తప్పుకున్నారు. కోర్టు ఆర్డర్ ను కూడా లెక్కచేయకుండా అత్యుత్సాహంతో మాజీ పాలకవర్గాలు ఆదివారం నాడు డిపెండెంట్స్ అంటే ప్రత్యర్ధులు లేకుండానే 250 నుంచి 300 పైగా ఉన్నటువంటి కుటుంబాలు అంటే ఓటర్లు కోర్ట్ ఆర్డర్ ను గౌరవించి ఎవరు కూడా పాల్గొనలేదు. కానీ కొంతమందిని జతకట్టి తీసుకొచ్చి 100కు పైన ఓట్లు వేయించుకొని మాకు వందకు పైన మెజారిటీ వచ్చిందని, కడారి బాలేశంకు కేవలం 3 ఓట్లు వచ్చాయని, కాలనీ అంతా మా వైపు ఉందన్నట్టు పత్రికలలో ప్రచురించుకున్నారు. ఇదంతా పూర్తి అబద్దం, కొట్టు ధిక్కరణ కూడా.కాబట్టి అతి త్వరలోనే ఎన్నికలు చెల్లవని కోర్టు నుంచి ఆర్డర్స్ నోటీసులు కూడా వస్తాయి. మా ఎన్నికల ప్యానల్ గెలిచిందని జబ్బల్ చర్చుకునే వారందరికీ చెంప పెట్టవుతుందని ఈ సందర్భంగా గాదె రమణారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ప్రకటించిన ప్యానల్ కి ప్రత్యర్ధులు గాని వేరే ప్యానల్ గాని లేదని అధ్యక్షులుగా ఉంటానన్న కడారి బాలేశం కోర్ట్ ఆర్డర్ గౌరవిస్తూ చీఫ్ ఎన్నికల అధికారికి నేను తప్పుకుంటున్నట్లు లెటర్ ఇచ్చారని పేర్కొన్నారు. బాలేశం ఆ ప్యానల్ నుంచి ఎవరు పోటీ చేయలేదు. ప్రత్యార్థులు ఎవరూ లేరు. కానీ వాళ్లే తప్పుడు సమాచారంతో ముందుకెళ్లి మేము గెలిచామని, మా ప్యానల్ గెలిచిందని ప్రత్యర్థులకు మూడోట్లు వచ్చాయని ప్రకటించుకోవడం శుద్ధ తప్పు,ఇది పూర్తి విరుద్ధం అని కచ్చితంగా రాబోయే కాలంలో కోర్టు ధిక్కరణ కేసు అదేవిధంగా మీరు చేసిన తప్పిదాలకు చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, మీ ప్యానల్ ఎన్నికలు రద్దయి మళ్ళీ కాలనీలో ప్రశాంత వాతావరణంలో ఈ కాలనీ ఉంచడానికి మేము మావంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *