మిర్చి రైతుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వినతి
మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో గళం వినిపించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పార్లమెంటు సభ్యులు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రేవంత్ రెడ్డిని సాంబశివరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులకు సమగ్ర వాణిజ్య పంటల బీమా పథకం అమలు మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి కంటే నాణ్యమైన కనీస గిట్టుబాటు ధర కల్పన సబ్సిడీపై వ్యవసాయ ఉపక రణాల పంపిణీ టమాట చిల్లీ వరంగల్ చపట మిర్చి బ్యాడగి ముందు వంటి దేశవాళీ మిర్చి వంగడాలకు జీఐ గుర్తింపు సబ్సిడీపై సూక్ష్మ సాగునీటి ఉపకారణాలు పంపిణీ మొదలగు అంశాలను రేవంత్ దృష్టికి సాంబశివరెడ్డి తీసుకెళ్లారు. సమస్యలు విన్న రేవంత్ రెడ్డి పార్లమెంటులో మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు మేలు జరిగేలా తమ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని సంక్షేమం వైపు నడిపిస్తామని అన్నారు. అనంతరం వ్యవసాయ రంగానికి చిహ్నమైన నాగలి మరియు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేఖ నాసిరెడ్డి సాంబశివరెడ్డి రేవంత్ రెడ్డికి బహుకరించారు.
నాగలిని చూసి ముచ్చట పడ్డ రేవంత్….
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి బహుకరించిన వ్యవసాయ రంగానికి చిహ్నమైన కలప నాగలిని చూసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మురిసిపోయారు. నాగలి తయారు చేసిన కళాకారుడిని అభినందించినట్లు తెలపమన్నారు. నాగలి వ్యవసాయ రంగానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్కీ వెంకన్న, మోయునుద్దీన్అ, శ్వాపురం భద్రాచలం ప్రాంతాలకు చెందిన మిర్చి రైతులు, స్వచ్ఛంద సంస్థల, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.