విద్యార్థులకు క్రీడ దుస్తులు పంపిణీ
గోవిందరావుపేట, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కర్లపల్లి ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కర్లపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వివిధ క్రీడలలో రానిస్తున్న క్రీడాకారులకు ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ రాములు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం ఆదినారాయణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
