గురుకుల ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు 20 వరకు పొడిగింపు
ఈనెల 20 తారీకు వరకు పెంచినందుకు నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) కార్యదర్శులు రోనాల్డ్ రాస్ కు కృతజ్ఞతలు తెలిపారు
కరీంనగర్, మార్చి 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి రాను నిర్వహించే ప్రవేశ పరీక్ష గడవును ఈనెల 20 తారీకు వరకు పెంచినందుకు నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) కార్యదర్శులు రోనాల్డ్ రాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత బాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని 2022 /23 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి పూర్తి చేసుకుని 2023/ 24 విద్యా సంవత్సరంగాను 5వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులనీ, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను మీ సేవ కేంద్రాలలో కానీ, ఆన్లైన్ సెంటర్లలో కానీ వెళ్లి 20 తారీకు లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థిక భారాన్ని తగ్గించుకొని, గురుకులం చేర్పించడం వలన 24 గంటలు ఉపాధ్యాయుల సంరక్షణలో చదువుతో పాటు ఆహ్లాదకరమైన పాఠశాల ఆవరణంలో విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలు, కళల రంగాలలో ఉన్నతంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వృద్ధి చెందే విధంగా ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతారని, గురుకులాల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన అజీమ్ ప్రేమ్ జి, ఢిల్లీ యూనివర్సిటీ సీట్లు సాధించడమే కాకుండా అమెరికలో హార్వర్డ్ యూనివర్సిటీ సీట్లు సాధించడంతో పాటు చిన్న వయసులోనే ప్రపంచంలో కెల్లా ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ ఆనందులు, ప్రపంచంలో యోగాలో విజయం సాధించిన సుందర్ రాజు, అథ్లెటిక్స్ లో భారతదేశానికి వన్నెతెచ్చిన నందిని లాంటి ఎందరో విద్యార్థులు గురుకులాల్లో చదువుకున్న వారేనని తెలిపారు.