అష్టకాల నృసింహరామ శర్మ కన్నుమూత
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం
సిద్దిపేట, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని.. అష్టకాల నృసింహరామ శర్మ (80) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక సాహితీవేత్తగా, ఆయా రంగాలకు వారు చేసిన సేవలు చిరస్మ రణీయమని సిఎం అన్నారు. అష్టకాల గారి ఆధ్మాత్మిక సాహిత్య కృషి.. సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ గారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.