బాబాసాహెబ్ జయంతి : రాష్ట్ర వ్యాప్తంగా కళా ప్రదర్శనలు

బాబాసాహెబ్ జయంతి : రాష్ట్ర
వ్యాప్తంగా కళా ప్రదర్శనలు

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరిస్తున్నాశుభ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, సాంస్కృతిక శాఖ కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనీ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి చరిత్రను వారు అన్ని కులాలకు మతాలకు అందించిన సేవలను మరోసారి ప్రజలు స్మరించుకునే విధంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పాటల రూపంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ – 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ద్వారానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి పోరాట పూర్తికి తెలంగాణ రాష్ట్రం కల సహకారమైందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

దేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరుని భారత పార్లమెంటుకు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సచివాలయం కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి గౌరవించారన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్లకుంట చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చరిత్ర ను వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సారథి కళాకారులు ప్రచారం నిర్వహించాలని అందుకు కొత్త పాటలను, సాహిత్యాన్ని రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రవీంద్ర భారతి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రూపొందించిన కళా ప్రదర్శనల రిహార్శల్ లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *