బండి సంజయ్ పై
- ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల
- రెండున్నర గంటల పాటు సంజయ్ ను విచారించిన మహిళ కమిషన్
హైదరాబాద్, మార్చి 18 (విశ్వం న్యూస్) : దాదాపు రెండున్నర గంటల పాటు సంజయ్ ను విచారించిన మహిళ కమిషన్. పొలిటికల్ గా,ఇంకా ఏవిధంగా నైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు,మరోసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదు. మహిళ పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వీడియో ల రూపంలో చుపించి విచారణ చేసిన మహిళ కమిషన్. బతుకమ్మ ను,మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వీడియో లు చూపిస్తూ విచారణ చేసిన కమిషన్భ విష్యత్తు లో మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అంటూ బండి సంజయ్ కు ఆదేశాలు. ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చిన బండి సంజయ్. అనుకోకుండా చేసిన వాక్యాలు తప్ప నేను ఎలాంటి దుర్దేశం లో చేయలేదు.
అన్ని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ బండి సంజయ్ సంజాయిషీ ఇచ్చుకున్న సమాచారం
- ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో కవితను తాను అక్కగా సంబోధించనట్లు కమిషన్‌కు చెప్పినట్లు సమాచారం
- మళ్లొకసారి బండి సంజయ్‌ని కమిషన్ విచారించే అవకాశం.
- మహిళలపై మరోసారి సామెతలను ప్రయోగించొద్దంటూ కమిషన్ ఆదేశించినట్లు సమాచారం
- మరోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం
- ఎవ్వరైనా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక