దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…
ఘనంగా మహిళా దినోత్సవం

- పాల్గొన్న బండ్లగూడ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగిర్, జూన్ 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తై.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో శాఖ ఆధ్వర్యంలో మంత్రులు.. అధికారులు.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రోజున మహిళా దినోత్సవం కార్యక్రమాన్నిబండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జి ఆర్ కే గార్డెన్ లో మహిళా దినోత్సవాన్నినిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డీవో చంద్రకళ, ఎమ్మార్వో రాజశేఖర్, బండ్లగూడ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఒకటో వార్డు కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.