అంగరంగ వైభవంగా ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు
అంగరంగ వైభవంగా ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట, మార్చి 20 (విశ్వం న్యూస్) : భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ శ్రీ గౌరవనీయులైన ఈటెల రాజేందర్ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తాలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ పండ్ల పంపిణీ చేయడం జరిగినది. తెలంగాణ ఉద్యమ సాధనలో మీ యొక్క ఉద్యమ స్ఫూర్తి, వీరత్వం మరువలేనివి, మీ యొక్క సేవలు తెలంగాణ సమాజానికి ఎంతో అవసరం, నవతెలంగాణ నిర్మాణానికి మీరు పూనుకున్న ఉద్యమం తెలంగాణ భావితరాలకు మేలుకొలుపు తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు దేశ ప్రజల ఆశీస్సులతో మీరు ఎల్లవేళలా సుఖశాంతులతో, సంతోషాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, పల్లపు రవి, మోతే స్వామి, ఇటికల సరూప, అప్పం మధు యాదవ్, ఠాగూర్ రాజేష్, కైలాస కొట్టి గణేష్, రావుల శ్రీనివాస్, మోడం రాజు, కొండ్ల నాగేష్, బూరుగుపల్లి రామ్, రాచపల్లి ప్రశాంత్, శనిగరపు రవి, ఇల్లందుల శ్రీనివాస్, ఎండి రజియా, ఆకుల రవీందర్, రేవెల్లి వెంకటస్వామి, ఎ రామస్వామి, నాగపురి విజయ్, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, యాంసాని సమ్మయ్య, ఉడుగుల మహేందర్, రాపర్తి ప్రవీణ్, బొజ్జ శరత్, బి వెంకటేష్, చందా సంతోష్, కేశ సరూప, రాంపెళ్లి రాంప్రసాద్, పల్లపు పృథ్వీరాజ్, బత్తుల శీను, తదితరులు పాల్గొన్నారు.
