అద్భుతమైన పెయింటింగ్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బర్త్ డే విషెష్

ప్రముఖ చిత్రకారుడు, బి.అర్.యస్ నాయకులు అంబాల ప్రభాకర్
జమ్మికుంట, మార్చి 13 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్(ప్రభు) సోమవారం రోజున అద్భుతమైన చిత్రాన్ని తన కుంచెతో పెయింటింగ్ గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలోకాన్ని చైతన్యపరచి స్వరాష్ట్ర సాధనలో ముఖ్య భూమికి పోషించారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరిగే బతుకమ్మ పండుగను ఘనంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా చేశారని తెలిపారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రముపై విషం చిమ్ముతో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తన కుటుంబం పైన తెలంగాణ మంత్రుల పైన ఈడీ దాడుల పేరుతో కుట్రపూరితమైన అసాధారణ ఆరోపణలు, కేసులు పెడుతూ కుట్రలు చేయడాన్ని ప్రముఖ చిత్రకారుడు టిఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈడీ దాడులు గాని, అక్రమ కేసులకు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు పడరని, సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు తీరని అన్యాయం చేయడాన్ని ఉద్యమ నాయకుడు కెసిఆర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆంధ్ర నాయకులు సుదీర్ఘంగా ఉద్యమాన్ని చేసి తెలంగాణ స్వరాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నారని తెలిపారు. ఈడీలకు కేడీలకు భయపడే ప్రసక్తే లేదని వారికి వారి కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరికీ యావత్ తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచి వారు చేస్తున్న అక్రమ కేసులు గాని అసత్య ఆరోపణలని తిప్పి కొడుతామని హెచ్చరించారు.