
- తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో మంది అమాయక
ప్రజల మరణాలకు కారణమైన బిజెపి నాయకులను శిక్షించాలి - చేసిన తప్పులను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ కళ్ళలోకి చూడలేక భయంతో కుట్రలకు తెరలేపారు
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు
కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజం
కరీంనగర్, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్) : పథకం ప్రకారమే రాహుల్ గాంధీ పై బిజెపి కుట్రపన్నిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు, ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే నల్లా ధనాన్ని వెలికితీసి ప్రతిఒక్కరి ఖాతాలో పది హేను లక్షలు జమ చేస్తామని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేయడమే కాకుండా కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల సరైనా సమయంలో చికిత్స అందించలేక వ్యాక్సిన్ అందించలేక ఎంతో మంది మరణానికి కారణమైన బిజెపి నాయకులను ప్రజాకోర్టులో శిక్షించాలని పేర్కొన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ పై పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు పాల్పడ్డ బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ను నిలదీస్తామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, ఎస్సీ లింగంపల్లి బాబు, నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్రపోచయ్య, అఖిల్, దండి రవీందర్, కొరివి అరుణ్ కుమార్, నిహాల్, వంగల విద్యాసాగర్, పోరండ్ల రమేష్, మేకల నరసయ్య, జీడి రమేష్, షబానా మహమ్మద్, కవిత, షహేన్షా, లైక్ ,మామిడి సత్యనారాయణ రెడ్డి, మెతుకు కాంతయ్య, ఎస్ డి అజ్మత్, ముక్క భాస్కర్ , కీర్తి కుమార్, అబ్దుల్ బారి, నదీమ్, ఇమామ్, కుంభాల రాజకుమార్, కమల్ తదితరులు పాల్గొన్నారు.