బిఆర్ఎస్ బిజెపి రెండు ఒక్కటే

బిఆర్ఎస్ బిజెపి రెండు ఒక్కటే

బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్.
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో రాజకీయ అనుచ్చితి ఏర్పడిందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కేవలం అధికార దాహం కోసమే తమ ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు తప్ప వారికి పేద ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని, రాష్ట్రంలో అత్యున్నత పరీక్షలైన టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పత్రాన్ని లీక్ చేసి, పేద నిరుద్యోగుల యువకుల విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని, టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పత్రం లీకేజ్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విస్తృత పోరాటాలు జరుగుతున్న కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఇది నిజంగా కూడా పేద ప్రజలపై వారికి ఉన్న ధోరణి ఎందో అర్థమవుతుందని, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అంశాలపై స్పందించాలని కోరుతూ తేదీ:- 18/03/2023 రోజున రాష్ట్ర గవర్నర్ గారికి, అదేవిధంగా తేదీ:- 31/03/2023 రోజున రాష్ట్రపతి గారికి వినతి చేసిన కూడా వారు కూడా స్పందించకపోవడం టిఆర్ఎస్ బిజెపి యొక్క స్నేహం ఏమిటో దీంట్లోనే అర్థం అవుతుందని,

ప్రజల చేత ఎంపీగా ఎన్నుకోబడ్డ బండి సంజయ్, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వారు తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రజలపై పట్టింపు లేకుండా, అభివృద్ధిపై ఆలోచన లేకుండా కేవలం అధికారాన్ని అనుభవిస్తున్నారు. పైపెచ్చు రాష్ట్రంలో ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే మాటలు మాట్లాడుతూ, నల్ల బజార్లో గుట్కా దందా, గంజాయి దందా, చేయడంతో పాటు ఇవాళ 10వ తరగతి పరీక్షా పత్రం లీకేజ్ కి కారణమై A1 గా ఉండడం సిగ్గుచేటని జక్కని సంజయ్ కుమార్ దుయ్యబట్టారు, వారు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు తప్పకుండా బొంద పెడతారని అన్నారు.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ మహిళా కన్వీనర్ జన్ను స్వరూప, అసెంబ్లీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు సమనపల్లి శంకర చారి, ప్రధాన కార్యదర్శి రేవెల్లి అజయ్, కార్యదర్శి మెస్రం రాహుల్. కోశాధికారి మహమ్మద్ ముజీబ్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ అల్లూరి అనురాధ, కంపల్లి విజయ, నాగలక్ష్మి, పట్టణ అధ్యక్షులు అస్తపురం మదు, ప్రధాన కార్యదర్శి కత్తుల హేమంత్, గొల్లపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *