- బిఆర్ఎస్,బిజెపి చీకటి ఒప్పందం లేకపోతే బండి సంజయ్, నిందితుడు ప్రశాంత్ మాట్లాడిన కాల్ డేటా ఎందుకు బయట పెడుతలేరు.
- నిరుద్యోగుల,విద్యార్థుల జీవితాలతో రెండు పార్టీలు చెలగాటమాడుతున్నాయి
- వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గురుకుల పాఠశాల విద్యార్థి హరీష్ బలికావాలా
- చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
- నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : బిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉండడం వల్లనే ఎంపి బండి సంజయ్ పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజి నిందితుడు ప్రశాంత్ మాట్లాడిన కాల్ డేటా బహిర్గతం చేస్తలేరని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న లీకేజిల వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి రెండు పార్టీలు అరెస్టుల డ్రామాకు తెరలేపాయని పేర్కొన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల గురుకుల పాఠశాల విద్యార్థి హరీష్ బలవుతున్నాడని నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్,లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య,గడ్డం విలాస్ రెడ్డి,దండి రవీందర్, ముక్క భాస్కర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, మెతుకు కాంతయ్య, కొరివి అరుణ్ కుమార్,ఎం డి చాంద్,జీడీ రమేష్,దన్న సింగ్,పోరండ్ల రమేష్, సలిమొద్దిన్, షబానా మహమ్మద్, షేహెన్ష, కంకణాల అనిల్ కుమార్,నదిం,నెల్లి నరేష్, కాంపెళ్ళి కీర్తి కుమార్,ముల్కల కవిత, ఎన్నెల పద్మ,జ్యోతి, రాజ్ కుమార్,మంద మహేష్,లింగ మూర్తి, జిలకర రమేష్,అజ్మత్, బషీర్,కమల్ తదితరులు పాల్గొన్నారు.