నిరుపేద ముస్లిం ఆడబిడ్డ పెళ్లికి 50 కిలోల బియ్యాన్ని అందజేసిన బి.ఆర్.ఎస్ నాయకులు
జాతీయ కళారత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు)
జమ్మికుంట, జనవరి 5, (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నటువంటి నిరుపేద ముస్లిం ఎక్బాల్ – సఫియా దంపతుల కుమార్తె వివాహం ఈనెల 7వ తారీకు ఉన్నందున వారి కుమార్తె వివాహానికి సహాయం కోరగా మానవత్వంతో 50 కిలోల జైశ్రీరామ్ బియ్యాన్ని గురువారం రోజున బి.ఆర్.యస్ నాయకులు జాతీయ కళారత్న అవార్డు గ్రహీత అందజేశారు. కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా మానవత్వంతో ఉండాలని సూచించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన ప్రకారం ఈ దేశం లౌకిక భారతదేశం. ఈ భారత దేశంలో నివసిస్తున్నటువంటి సబ్బండ మతాల కలయికే భారతదేశం అని మనమంతాభారతీయులమని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి తప్పా ఒకరి మతాన్ని ఇంకొకరి మతాన్ని కించపరిచే విధంగా వివాదాలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణం లో కులాలకు, మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండేలా కృషి చేయాలని, అన్ని మతాల వారందరు ఒకరినొకరు గౌరవిస్తూ, ప్రేమ, దయ, కరుణ చూపుతూ ఆపదలో, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలని, మానవత్వం ఉన్న మనుషులుగా బ్రతకాలని, కుల , మాతాల మధ్య విభేదాలు సృష్టించి ప్రజల మధ్య అశాంతి కి తావివ్వద్దని విజ్ఞప్తి చేశారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధం, సిక్కుల మాటలలో ఉన్న ప్రజలు కలిసి మెలిసి సోదర భావంతో ఉండాలని తప్ప స్వార్థ రాజకీయాల కోసం మత ఘర్షణలు సృష్టించద్దని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణను శాంతియుతంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య రమాకాంత్ బషీర్ లు తదితరులు పాల్గొన్నారు.