హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 2024, మార్చి 3వ తేదీ ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి | సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు కలిశారు.
మార్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. అయితే, ఆయన త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారని కొన్ని రోజులుగా ప్రచారం | జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఫ్యామిలీతోపాటు సీఎంను కలువడంతో తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ అగ్రనేతలను కలవరానికి గురిచేస్తున్నట్లు సమాచారం.