కరీంనగర్:పది తలల రావణ
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
- అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు, రణరంగంగా మారిన ఇందిరా చౌక్.
- ఆగ్రహంతో బిఆర్ఎస్ ఫ్లెక్సీలను చించిన కాంగ్రెస్ కార్యకర్తలు.
- దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది దగా చేస్తుంది.
- కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు
- పోలీసులే కెసిఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టే రోజు వస్తుంది.
కరీంనగర్ బ్యూరో, జూన్ 22 (విశ్వం న్యూస్) : దశాబ్ది దగా పేరుతో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రకటించిన 10 హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా టిపిసిసి పిలుపు మేరకు గురువారం రోజు కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ లో కెసిఆర్ విస్మరించిన 10 హామీలను సూచిస్తూ ఏర్పాటుచేసిన పది తలల రావణ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ..ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారు
ప్రధానంగా అమలు చేయని హామీలైన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల ఉద్యోగాలు, గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పోడు భూముల పట్టాల పంపిణీ ఇలాంటి అనేకమైన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు అని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు.
ఏ ఆలోచనతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారో అందుకు అనుగుణంగా సామాజిక సంక్షేమ తెలంగాణ ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని తెలియజేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపుమేరకు 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుంది. దిష్టిబొమ్మల దహనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చి సమీక్షించుకొని ఈ మూడు నెలల సమయంలో హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలని లేదంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, పడాల రాహుల్ గౌడ్, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, సమద్ నవాబు, రహమతు హుస్సేన్, ఎస్ ఏ మోసిన్, మేనేని రోహిత్ రావు, అబ్దుల్ రహమాన్, బోనాల శ్రీనివాస్, కుర్రపోచయ్య, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, సలీముద్దీన్, గడ్డం విలాస్ రెడ్డి, మేకల నర్సయ్య, ఎండి చాంద్, దండి రవీందర్ ,మామిడి సత్యనారాయణ రెడ్డి, విక్టర్ దన్ను సింగ్, బత్తిని చంద్రయ్య, గౌడ్ సిరాజు, హుస్సేన్, షబానా మహమ్మద్, పంజాల స్వామి గౌడ్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, ఇర్ఫాన్, ములకల కవిత, ఉరడి లత, సాయిళ్ళ రాజు, అబ్దుల్ బారి, పొన్నం శ్రీనివాస్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నిహాల్, నెల్లి నరేష్, నదీమ్, గడ్డం శ్రీనివాస్, గంగుల దిలీప్, శ్యాంసుందర్ రెడ్డి, హరీష్, ఫిరోజ్ నవాజ్, ములుగు ప్రకాష్, వీరేశం, కే రాజ్ కుమార్, నూనె గోపాల్ రెడ్డి, లైక్ కే రామిరెడ్డి, హనీఫ్, మోసర్ల రామ్ రెడ్డి, సిరిపురం నాగప్రసాద్, అప్సర్, సుంకరి గణపతి, మెతుకు కాంతం, కమల్, నదీమ్, నెల్లి నరేష్, గడప అజయ్, పరదాల లింగమూర్తి, షహింసా, దీకొండ శేఖర్, హనీఫ్, ముక్క భాస్కర్, దుబాసి మోహన్, ముల్కల మోహన్, శారద, సోహెల్ దామోదర్, ఎజ్రా జ్యోతి, కీర్తి కుమార్, పొలాస వాసు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.