కరీంనగర్: జీఎస్టీ బకాయిలను
వ్యాపారస్తులు వెంటనే చెల్లించాలి
- వ్యాపార సంస్థల యజమానులకు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నల్ల సాయి కిషోర్ విజ్ఞప్తి
కరీంనగర్, జూలై 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ మంకమ్మ తోట జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిగిన టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఇన్ ఫోర్స్ మెంట్ అధికారి నల్ల సాయి కిషోర్ మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భం అడిషనల్ కమిషనర్ సాయి కిషోర్ కు సన్మానం చేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టిసిటిఎన్జీవోస్ సంఘ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు.
పాత ఫిఫ్త్ జోన్ లో పనిచేస్తున్న సీనియర్ ఏసీటిఓలకు, అడిషనల్ డిసిటిఓ ఇంచార్జ్ ప్రమోషన్లు వెంటనే కల్పించాలని, డిఆర్ఎసిటిఓ కాళీ పోస్టులలో సీనియర్ అసిస్టెంట్లకు ఏసీటీవో ప్రమోషన్లు ఇవ్వాలని పాత ఫిఫ్త్ జోన్ పరిధిలో కొత్త సీటీవో కార్యాలయం మంజూరు చేయాలని, టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో కొత్త కంప్యూటర్లు, కుర్చీలు, టేబులు,ఫర్నిచర్ అన్ని రకాలుగా మంజూరు చేయాలని లారీల తనకిల కోసం పనిచేస్తున్న ఏసీటీవోలకు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేయాలని మరియు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారస్తుల ద్వారా రావలసిన బకాయిలను వసూలు చేయడానికి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కష్టపడి ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ రెవిన్యూ తేవడానికి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కృషి చేస్తారని వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ ఇన్ఫోసిమెంట్ అధికారి నల్ల సాయి కిషోర్ కు తెలంగాణ టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ ఇన్చార్జ్ జాయింట్ కమిషనర్ ఏ రవి కుమార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ అధ్యక్షులు జి బిక్షపతి, సిటిఓ లు చరణ్, కవిత, మాధయా, గౌతమ్, సిద్ధార్థ ఉద్యోగ సంఘ నాయకులు ఏ అనిల్ కుమార్, రజిత, సునీత, పోల్సాని శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరీంనగర్ పట్టణంలో అన్నపూర్ణ కాంప్లెక్స్ లో స్టేట్ సర్వే కార్యక్రమంలో ఎవరు జీఎస్టీ లైసెన్సు పొందకుండా వ్యాపారం చేస్తున్నారో అలాంటి షాపులకు వెళ్లి జిఎస్టి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేయాలని చెప్పుతూ లైసెన్స్ లేని దుకాణ యజమానులకు నోటీసులు ఇచ్చి గతంలో జీఎస్టీ లైసెన్స్ పొందిన వారు చెల్లించని వృత్తి పన్ను చెల్లించాలని చెప్పుతూ వారి వద్ద వృత్తి పన్ను కూడా వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి అధికారులు కృషి చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంతట వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రతి షాపులు తనకి చేస్తూ ఎంతమంది జిఎస్టి లైసెన్స్ పొందకుండా వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారి వివరాలను సేకరిస్తూ లైసెన్స్ తీసుకొని వారిని లైసెన్స్ తీసుకోవాలని అలాంటి వ్యాపార యజమానులకు నోటీసులు వెంటనే జీఎస్టీ కార్యాలయం ద్వారా లైసెన్స్ తీసుకోవాలని చెప్పటం జరుగుతుంది మరియు జీఎస్టీ లైసెన్స్ పొంది కూడా ప్రభుత్వ ఖజానాకు వృత్తి పన్ను చెల్లించని అలాంటి యజమానులు కూడా వెంటనే ప్రభుత్వ ఖజానాకు వృత్తి పన్ను ఆన్లైన్లో ప్రభుత్వ ఖజానాలో వెంటనే చెల్లించి జమ చేయించాలని ఈ వివిధ రకాల వ్యాపారస్తులకు అధికారులు కోరారు.