ప్రశాంతంగా టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

ప్రశాంతంగా టిఎస్ పి ఎస్ సి
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

  • మొత్తం అభ్యర్థులు 16,828
  • పరీక్షకు హాజరైన వారు10,955
  • గైర్హాజరు అయినవారు 5,873
  • 65.10 శాతం హాజరు.
  • జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

కరీంనగర్ బ్యూరో, జూన్ 11 (విశ్వం న్యూస్) : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు. తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలు , కొత్తపల్లి మండలం శాతవాహన యూనివర్సిటీ పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించి అభ్యర్థులు పరీక్షను రాస్తున్న విధానాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 34 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16,828 అభ్యర్థులకు గాను 10,955 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 5,873 మంది అభ్యర్థులు ఆబ్సెంట్ అయ్యారని 65.10 శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యకమంలో పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు, డీసీపీ శ్రీనివాస్, తహసిల్దార్ కనుకయ్య తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *