గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ
నిర్లక్ష్యమే: బల్మూరి వెంకట్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విశ్వం న్యూస్) : గ్రూప్ – 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ప్రభుత్వ నాయకులను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు.టీఎస్‌పీఎస్సీ ట్రాన్సపేరెన్సీగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూడు అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విద్యార్థుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అంతే కాకుండా యువత సమస్యలను పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.