ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు
గోవిందరావుపేట, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : మండల పరిధిలోని పసర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69 వ జన్మదిన వేడుకలు జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా పసర గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసచారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు అనంతరం తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రైతుల యొక్క గౌరవాన్ని కాపాడే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని కొనియాడారు ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పేద మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వెలిశాల స్వరూప మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ లాకావత్ చందులాల్, కర్లపల్లి సర్పంచ్ రామాంజయ్య, ముత్తాపురం సర్పంచ్ వంక నాగేంద్ర శ్రీనివాస్ నాయకులు, సంసోత్ రాజన్న నాయక్, మండల ఉపాధ్యక్షుడు వర్థం చందర్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, మండల ఉపాధ్యక్షుడు అజ్మీర సురేష్, సుడి పద్మా రెడ్డి, ధారావత్ పున్నం, బోళ్ల రాజాలు, కొండి రమేష్, యాస పూలమ్మ, ఇంజపూరి రాజయ్య, సోమ రవి, సంకర బోయిన సారయ్య, బండి నాగేశ్వరరావు, పసుల సమ్మయ్య, పసల భద్రయ్య, చుంచు యాకోబు, ఊటుకూరు వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.