వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ వాణీ జయరామ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వేయికి పైగా సినిమాల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలను సిఎం గుర్తు చేసుకున్నారు.
ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని సీఎం అన్నారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలు కొనసాగించింది.