చిరంజీవీ డాన్స్‌కు కింగ్ అయితే మా డాడి డైలాగ్‌కు కింగ్: నారా బ్రాహ్మణి

చిరంజీవీ డాన్స్‌కు కింగ్ అయితే మా డాడి డైలాగ్‌కు కింగ్: నారా బ్రాహ్మణి

హైదరాబాద్, జనవరి 17 (విశ్వం న్యూస్) : నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు పెద్దగా వాగ్దాటి లేదు. కానీ ఆయన భార్య, బాలకృష్ణ కూతురైన నారా బ్రాహ్మణి మాత్రం తెలుగు, ఇంగ్లీషులో అనర్గంగా మాట్లాడగలదు. ఆ వాగ్దాటి ఆమెకు వచ్చింది. ఇక విషయానికి వస్తే భారతీయ సినీ చలనచిత్ర పరిశ్రమలో అమితాబచ్చన్, సీనియర్ ఎన్టీఆర్, శివాజీ గణేషన్ వంటి వారు డైలాగులు చెప్పడంలో తమదైన శైలి కలిగి ఉండేవారు. ఇక ఎన్టీఆర్ తనయుడైన నందమూరి బాలకృష్ణకు కూడా సినిమాలలో డైలాగులు చెప్పే విషయంలో ఓ స్పెషాలిటీ ఉంది. డాన్సులు, స్టెప్పులు, యాక్టింగ్ పరంగా మెగాస్టార్ చిరంజీవిది పైచేయి అయినప్పటికీ పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలో నందమూరి బాలకృష్ణకు పోటీని ఇచ్చేవారు ఎవరూ లేరని చెప్పాలి. ఈ జనరేషన్ లో బాలయ్యతో పాటుగా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే సమకాలీకుడు లేడని చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తాజాగా ఇదే విషయం గురించి బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని హిట్టు దిశగా దూసుకువెళుతుంది. ఈ సినిమాను అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా చూసి తమదైన రివ్యూలు చెబుతున్నారు. తాజాగా బాలయ్య పెద్ద కూతురు బ్రహ్మణి వీరసింహారెడ్డి సినిమాను హైదరాబాద్ కూకట్ ప‌ల్లిలో ఓ థియేటర్‌లో అభిమానుల మధ్య కూర్చొని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె తన రివ్యూ ఇచ్చింది. సినిమా చాలా బాగుంది. అభిమానులకు నచ్చుతుంది.
నా తండ్రి సినిమాను అభిమానులతో వీక్షించడం నాకు ఇష్టం. బాలకృష్ణ ఆయ‌న నటన‌ను ఎంత చెప్పినా తక్కువే. నా తండ్రిలా డైలాగ్స్ చెప్పడం దేశంలో ఎవరి వల్ల కాదు. అలాంటి నటుడు దేశంలో ఒక్కడే ఉంటాడు అని చెప్పుకొచ్చింది. పర్సనల్‌గా వీర సింహారెడ్డి నాకు చాలా నచ్చింది. నాన్న లుక్ బావుంది.
ప్రత్యేకంగా రాయలసీమను ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించడం నాకు బాగా నచ్చింది. ప్రతి సంక్రాంతికి నాన్న గారు అభిమానులకు ప్రేక్షకులకు ఎలాంటి కానుక ఇస్తారో ఈసారి వీర సింహారెడ్డితో కూడా మంచి కానుక ఇచ్చారని తనదైన శైలిలో రివ్యూ నిచ్చింది ప్రస్తుతం బ్రాహ్మణి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *